రష్మిక మండన్న ఇచ్చిన ఫిట్టింగ్ రిప్లై

Saturday,February 02,2019 - 11:06 by Z_CLU

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో బిజీగా ఉంది రష్మిక మండన్న. నిజానికి రష్మికకి ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది తన కన్నడ డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ వల్లే. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతోనే ‘ఛలో’ సినిమాలో అవకాశం దక్కించుకుంది రష్మిక. ఆ తరవాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయిపోయింది. అయితే రష్మికకి ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది.

ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే మరో వైపు మంచి స్క్రిప్ట్ తో కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ లో ఉన్న రష్మికపై కన్నడ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారని సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలొస్తున్నాయి. కన్నడ సినిమాలకు ఏ మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, ఫోకస్ మొత్తం తెలుగు సినిమాపైనే పెడుతుందనే, వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్ కి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది రష్మిక.

ఇప్పటికే 2 కన్నడ సినిమాలకు సంతకం చేసిన రష్మిక, నా ఫ్యాన్స్ నాపై కోపంగా ఉండటమేంటి..? ఉంటే ఆధారాలు చూపించండి అంటూ, ట్వీట్ చేసింది. దాంతో రష్మిక చుట్టూ మరింత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. జస్ట్ తెలుగు సినిమాలే కాదు, కన్నడ సినిమాలు కూడా తనకంతే ఇంపార్టెంట్ అని చెప్పకనే చెప్పేసింది రష్మిక.