రేపే అల్లు శిరీష్ ‘ఒక్కక్షణం’ టీజర్ రిలీజ్

Saturday,December 02,2017 - 01:38 by Z_CLU

V.I. ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. లవ్ Vs డెస్టినీ అనే క్యాప్షన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసింది. అల్లు శిరీష్ సరసన సురభి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్ ని రేపు 10:30 కు రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్.

‘ఒక్కక్షణం’ మూవీ థీమ్ తో పాటు స్టాండర్డ్స్ ఎలివేట్ అయ్యేలా, టీజర్ ని ప్లాన్ చేసుకుంటున్న సినిమా యూనిట్, ఈ సినిమా అల్లు శిరీష్ కరియర్ లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్ తో ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ లో ‘ఒక్కక్షణం’ ప్లే చేసే రోల్ ఏంటి..? అల్టిమేట్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అనేది రేపు రిలీజయ్యే టీజర్ తో తెలిసిపోతుంది అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్ 23 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.