సంక్రాంతి బరిలో సూర్య ‘గ్యాంగ్’

Saturday,December 02,2017 - 02:15 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాత వాసి’, బాలయ్య ‘జై సింహా’,  విశాల్  ‘అభిమన్యుడు’  తో పాటు రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాల మధ్య సూర్య ‘గ్యాంగ్’ తో సందడి చేయబోతున్నాడు. అల్టిమేట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, జనవరి 12 న రిలీజ్ కానున్నట్టు అనౌన్స్ చేసింది.

ఈ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేస్తుంది. గతంలో నయనతార లీడ్ రోల్ ప్లే చేసిన ‘నేను రౌడీనే’ మూవీకి దర్శకత్వం వహించిన విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి డైరెక్టర్.

తన ప్రతి సినిమాలో ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త పడే సూర్య ఈ ఫస్ట్ లుక్ తో మ్యాగ్జిమం ఇంప్రెస్ చేసేశాడు., ప్రస్తుతం మ్యాగ్జిమం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ని త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. UV క్రియేషన్స్  సమర్పిస్తున్న  ఈ   ‘గ్యాంగ్’  ని స్టూడియో  గ్రీన్ బ్యానర్ పై  జ్ఞానవేల్ రాజా  నిర్మిస్తున్నాడు.