Allu Arjun Vikram Kumar - ఈ మూవీ అప్ డేట్ ఏంటి?

Wednesday,June 09,2021 - 01:15 by Z_CLU

చాన్నాళ్ల కిందటి సంగతి. అల్లు అర్జున్ కోసం విక్రమ్ కుమార్ ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇద్దరి మధ్య చాన్నాళ్లు స్టోరీ డిస్కషన్లు కూడా నడిచాయి. కానీ లాస్ట్ మినిట్ లో ఆ ప్రాజెక్టు డ్రాప్ అయింది. అది ఎందుకు డ్రాప్ అయిందనే విషయంపై ఎవ్వరూ స్పందించలేదు. ఎట్టకేలకు బన్నీతో చేయాల్సిన సినిమాపై విక్రమ్ కుమార్ రియాక్ట్ అయ్యాడు.

“అల్లు అర్జున్ తో సినిమా చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. బన్నీతో సినిమా నాకు డ్రీమ్ ప్రాజెక్టు లాంటిది. స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. అది అందరికీ నచ్చితే తప్పకుండా మా కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది.”

ఇలా బన్నీతో చేయాల్సిన సినిమాపై స్పందించాడు విక్రమ్ కుమార్. చెప్పిన కథల్నే మళ్లీ మళ్లీ చెబితే విసుగొస్తుందంటున్న ఈ దర్శకుడు.. తనకు కొత్తగా అనిపించిన కథల్ని మాత్రమే సెలక్ట్ చేసుకుంటానంటున్నాడు. ప్రస్తుతం నాగచైతన్యతో చేస్తున్న థ్యాంక్ యూ సినిమా కూడా అలాంటిదేనంటున్నాడు విక్రమ్ కుమార్.

“మనం నుంచి అఖిల్, నాగచైతన్య నాకు మంచి ఫ్రెండ్స్. చైతూకు ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో నాగచైతన్య లుక్ చాలా బాగుంటుంది. ఇది తనకు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.”

మరోవైపు తను చేయబోయే వెబ్ సిరీస్ పై కూడా రియాక్ట్ అయ్యాడు విక్రమ్ కుమార్. వెబ్ సిరీస్ కోసం కథ రెడీ అవుతోందని, అందులో ఎవరు హీరోగా నటిస్తారనే విషయంపై ప్రొడక్షన్ హౌజ్ ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics