August Releases - ఆ సినిమాల పరిస్థితేంటి?

Wednesday,June 09,2021 - 01:10 by Z_CLU

మెల్లగా లాక్ డౌన్ సడలింపు జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో కొన్ని గంటల పాటు రిలాక్సేషన్ టైం పెంచారు కూడా. ప్రస్తుతం వ్యాక్సినేషన్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. సో మరో నెలన్నర రెండు నెలల్లో పరిస్థితి కొంత వరకు చక్కబడే అవకాశం కనిపిస్తుంది. జులై ఎండింగ్ లేదా ఆగస్ట్ నుండి థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఇక రిలీజ్ వరకూ వచ్చి వాయిదా పడిన సినిమాలు ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Tuck Jagadish nani ritu varma

టక్ జగదీష్ లో నాని, రీతూవర్మ

నాగచైతన్య ‘లవ్ స్టోరి’, నాని ‘టక్ జగదీశ్’, రానా ‘విరాట పర్వం’ సినిమాలు ఆగస్ట్ లో విడుదల చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. దాదాపు రెండు నెలలుగా థియేటర్స్ మోసి ఉండటంతో మళ్ళీ ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్స్ కొచ్చి సినిమాలు చూస్తారని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ నమ్ముతున్నారు. అందుకే ప్రభుత్వం సినిమా హాళ్ళకు పర్మీషణ్ ఇచ్చిన వెంటనే ఆ సినిమాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

sai-pallavi-virataparvam

                ‘విరాటపర్వం’లో సాయిపల్లవి

ఇక ఆగస్ట్ లో థియేటర్స్ ఓపెన్ అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈ మినిమం బడ్జెట్ సినిమాలు ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ మూడు సినిమాలతో పాటు ఇష్క్, పాగల్ లాంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. మరి ఆగస్ట్ లో కనుక థియేటర్స్ ఓపెన్ అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్యూ కడతాయి.

గతేడాది లాక్ డౌన్ తర్వాత సాయి ధరం తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, రవితేజ ‘క్రాక్’, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాలు విడుదలై మంచి మంచి కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics