ఒక్క పాట కోసం 2 నెలల కష్టం

Thursday,May 03,2018 - 05:30 by Z_CLU

ఓ సినిమా కోసం మేకోవర్ అవ్వడానికి 2 నెలలు టైం తీసుకుంటే ఓకే. కానీ సినిమాలో వచ్చే ఒకే ఒక్క పాట కోసం 2 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే ఏమనాలి. దటీజ్ బన్నీ. సింగిల్ సాంగ్ కోసం కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఈ స్టయిలిష్ స్టార్. ఎంతో కష్టపడి “క్యాప్ టెక్నిక్స్” నేర్చుకొని మరీ సాంగ్ లో నటించాడు. దీని కోసం అల్లు అర్జున్ పడిన కష్టం ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

నిజానికి ఈ పాట కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. తలుచుకుంటే గ్రాఫిక్స్ తో పనికానిచ్చేయొచ్చు. దర్శకుడు కూడా అదే చెప్పాడు. కానీ బన్నీ ఒప్పుకోలేదు. గ్రాఫిక్స్ పెడితే సహజత్యం ఉండదన్నాడు. పైగా ఆడియన్స్ ను మభ్యపెట్టు అవుతుందని భావించాడు. అందుకే ప్రత్యేకంగా ట్రయినింగ్ తీసుకున్నాడు. ఆ పాటే లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో సాంగ్.

అమెరికన్ హిపాప్ సాంగ్స్ లో ఈ స్టయిల్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టెక్నిక్స్ కోసం ఏళ్ల తరబడి కష్టపడతారు. కనీసం ఏడాది ప్రాక్టీస్ చేయకుండా ఈ టెక్నిక్స్ నేర్చుకోవడం కష్టం. అలాంటిది పట్టుబట్టి 2 నెలల్లో నేర్చుకున్నాడు బన్నీ. రోజూ పొద్దున్నే లేవడం ప్రాక్టీస్ చేయడం, రాత్రి పడుకునే ముందు మళ్లీ ప్రాక్టీస్. ఇలా రోజుకు 5 గంటలు చొప్పున 2 నెలల పాటు కష్టపడి ఈ టెక్నిక్స్ నేర్చుకున్నాడు బన్నీ. తన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం చూపించాలనుకుంటాడు బన్నీ. అందుకే ఈ కష్టమంతా.