బన్నీ క్యారెక్టర్.. ఇదే ఇప్పుడు వైరల్ టాపిక్

Thursday,May 03,2018 - 04:56 by Z_CLU

‘ఆర్య’లో లవర్ బాయ్ గా చూశాం. ‘వేదం’లో స్లమ్ కుర్రాడిలా కూడా చూసేశాం. గోన గన్నారెడ్డిగా హిస్టారికల్ క్యారెక్టర్ లో కూడా కనిపించాడు బన్నీ. ఇలా ఎన్నో క్యారెక్టర్స్ తో మెప్పించాడు అల్లువారబ్బాయ్. అయితే ఇప్పటివరకు బన్నీ చేసిన క్యారెక్టర్స్  అన్నీ ఒకెత్తు. అతడు పోషించిన సూర్య పాత్ర మరో ఎత్తు. అవును.. ‘నా పేరు సూర్య’లో బన్నీ చేసిన సూర్య పాత్ర, అతడి కెరీర్ లోనే వెరీ వెరీ స్పెషల్.

సూర్య.. ఇతడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు. దేశాన్ని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేడు. ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. ఈ లక్షణాలకు తోడు సిన్సియర్ మిలట్రీ ఆఫీసర్ కూడా. ఇలాంటి హై-ఎమోషనల్ పాత్రను తన కెరీర్ లో ఇప్పటివరకు పోషించలేదు బన్నీ. అందుకే బన్నీ పోషించిన సూర్య పాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఒక్కరు ఈ క్యారెక్టరైజేషన్ గురించే చర్చించుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ పోషించిన అర్జున్ రెడ్డి పాత్ర, రంగస్థలంలో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు క్యారెక్టర్, ముఖ్యమంత్రి భరత్ పాత్ర.. ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో.. అంతకుమించి సూర్య ఆకట్టుకుంటాడని ప్రొడ్యూసర్ లగడపాటి, ప్రజెంటర్ నాగబాబు నమ్మకంగా చెబుతున్నారు.