Allu Arjun Pushpa - తగ్గేదే లే

Tuesday,April 20,2021 - 06:26 by Z_CLU

కరోన సెకండ్ వేవ్ టైంలో కొన్ని బడా సినిమాల షూటింగ్స్ వాయిదా పడుతున్నాయి. వరుసగా షూటింగ్స్ లో టెక్నీషియన్స్ కరోన బారిన పడుతుండటంతో మేకర్స్ షెడ్యుల్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ఇక యాక్టర్స్ కూడా షూటింగ్ కి బ్రేక్ తీసుకుంటామని మేనేజర్స్ తో చెప్పుకుంటూ మరికొన్ని రోజులు ఇంటికే మరిమితమవ్వాలనుకుంటున్నారని తెలుస్తుంది. అయితే బన్నీ -సుక్కు మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

అవును ‘పుష్ప’ షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. చక చకా అనుకున్న సన్నివేశాలు షూట్ చేసుకుంటూ పుష్ప యూనిట్ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని లోకేషన్స్ మేజర్ సీన్స్ కంప్లీట్ చేసేసిన యూనిట్ తాజాగా బూత్ బంగ్లాలో వేసిన సెట్ లో పీటర్ హెయిన్స్ కంపోజిషన్ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని ఇన్సైడ్ టాక్. ఈ రోజు సినిమాలో విలన్ గా నటించబోతున్న ఫాహద్ ఫాజిల్ షూట్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం  యూసఫ్ గూడ దగ్గర సన్నివేశాలు తీస్తున్నారు.

మరో వైపు పుష్ప ప్రకటించ డేట్ కి రిలీజ్ అవ్వడం కష్టమనే టాక్ వినబడుతుంది. అయితే మేకర్స్ జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసి ప్రకటించిన డేట్ వరకూ ఫస్ట్ కాపీ రెడీ చేసే పనిలో ఉన్నారు. అప్పటి కల్లా పరిస్థితులు చక్కబడితే అనుకున్నట్టు ఆగస్ట్ కే సినిమాను రిలీజ్ చేస్తారు. లేదా అక్టోబర్ లో దసరా కానుకగా పుష్ప థియేటర్స్ లోకి వస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుక్కు -బన్నీ -దేవి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూడో సినిమా ఆల్బంపై మ్యూజిక్ లవర్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics