Balakrishna - మరో మూవీకి గ్రీన్ సిగ్నల్?

Tuesday,April 20,2021 - 03:02 by Z_CLU

ప్రెజెంట్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో బాలయ్య నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. పస్తుతం గోపీచంద్ -బాలయ్య సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్న బాలయ్య తాజాగా మరో సినిమా లాక్ చేశాడని తెలుస్తుంది.

  • f3 movie anil ravipudi

అవును… వరుస సక్సెస్ లతో మంచి ఫాంలో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తుంది. గతంలో బాలయ్యకి రామారావు గారు అనే టైటిల్ తో ఓ కథ వినిపించాడు అనిల్. ఎందుకో ఆ సినిమా సెట్ అవ్వలేదు.

ఇప్పుడు అనిల్ రావిపూడి మరో కథను వినిపించాడని, లేటెస్ట్ స్క్రిప్ట్ బాలయ్య కి బాగా నచ్చిందని త్వరలోనే సినిమా చేద్దాం అంటూ అనిల్ కి చెప్పారని తెలుస్తుంది. ఈ కాంబో సినిమాను షైన్ స్క్రీన్స్ బేనర్ పై హరీష్, సాహు నిర్మిస్తారని టాక్. సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ కి ఈ బేనర్ నుండి అడ్వాన్స్ అందింది.

సో బాలయ్య -అనిల్ కాంబో లో రాబోయే ఈ సినిమా ఇదే బేనర్ లో ఉంటుందని అంటున్నారు.

  • balakrishna-gopichand

కామెడీని మిక్స్ చేసి యాక్షన్ డ్రామా సినిమా తీయడంలో అనిల్ దిట్ట. మరి బాలయ్య తో రూపొందే సినిమాను ఎలా తెరకెక్కిస్తాడు? ఎలాంటి స్క్రిప్ట్ సినిమా చేస్తాడు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా బాలయ్య -అనిల్ రావిపూడి కాంబో సినిమా నందమూరి ఫ్యాన్స్ ఆసక్తి రేకెత్తిస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎనౌన్స్ మెంట్ తర్వాత ఈ కాంబో మీద భారీ అంచనాలు నెలకొనడం ఖాయం.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics