బన్నీ ప్లాన్ అదేనా ?

Sunday,January 12,2020 - 01:02 by Z_CLU

‘అల వైకుంఠపురములో’ తో థియేటర్స్ హంగామా చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి నుండి ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్న బన్నీ నెక్స్ట్ ఓ బైలింగ్వెల్ సినిమా ప్లాన్ చేస్తున్నాడట.

అవును అల్లు అర్జున్ నెక్స్ట్ మురుగదాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ్ లో బైలింగ్వెల్ సినిమాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కే చాన్స్ ఉంది.