Allu Arjun - నెక్స్ట్ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి!

Thursday,May 20,2021 - 05:26 by Z_CLU

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఆ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఇటివలే మేకర్స్ ప్రకటించారు. దీంతో వచ్చే ఏడాది ఆరంభం వరకు బన్నీ పుష్ప షూటింగ్ తోనే బిజీగా ఉండనున్నాడని అంటున్నారు. ఇక పుష్ప ఫ్రాంచైజీ తర్వాత బన్నీ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. బన్నీ నెక్స్ట్ లిస్టులో వినబడుతున్న డైరెక్టర్స్ పేర్లే దీనికి కారణం.

అవును స్టైలిష్ స్టార్ నెక్స్ట్ లిస్టులో ఇప్పటికే కొందరు దర్శకుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక మురుగదాస్ తో పాటు వేణు శ్రీరామ్ బన్నీ కి స్క్రిప్ట్ చెప్పి ఉన్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ , కొరటాల శివ , త్రివిక్రమ్ లతో కూడా బన్నీ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇక నెక్స్ట్ లిస్టులో తాజాగా బోయపాటి శ్రీను తెరపైకి వచ్చింది. ‘సరైనోడు’ తర్వాత గీతా ఆర్ట్స్ లో బన్నీ తో బోయపాటి మరో సినిమా చేయాల్సి ఉంది. అల్లు అరవింద్ నుండి బోయపాటి కి ఎప్పుడో అడ్వాన్స్ కూడా వెళ్ళింది. కానీ ఈ కాంబో సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.

allu arju pushpa movie zeecinemalu

తాజాగా బోయపాటి బన్నీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసి అల్లు అరవింద్ ని కలిసి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడనే టాక్ వినబడుతుంది. బన్నీ కూడా బోయపాటి స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అయితే నెక్స్ట్ సినిమా ఏంటనేది మాత్రం బన్నీ ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తుంది.

మరి వీళ్ళల్లో బన్నీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆసక్తిగా మారింది. పుష్ప తర్వాత రాబోయే #AA22 ని ఏ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తాడో తెలియాలంటే బన్నీ నుండి లేదా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌజ్ నుండి ఓ అప్డేట్ రావాల్సిందే. అప్పటి వరకు బన్నీ నెక్స్ట్ లిస్టులో మరింత మంది దర్శకులు యాడ్ అవుతూ ఉంటారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics