స్నేహితుల కోసం ఆ భారీ ప్రాజెక్ట్!

Sunday,August 02,2020 - 10:02 by Z_CLU

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో, స్టార్డం ఉన్న డైరెక్టర్ కలిసి సినిమా చేస్తే ఆ ప్రాజెక్ట్ ను ఓ బడా నిర్మాణ సంస్థ చేజిక్కించుకుంటుంది. అందులో సందేహమే లేదు. కానీ ఈసారి అలా జరగలేదు. అవును.. తమ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాను మిత్రుల చేతిలో పెట్టి భారీ సినిమాతో వారిని పరిచయం చేయడానికి నిర్ణయించుకొని అనౌన్స్ చేసారు. మిత్రుల కోసం భారీ ప్రాజెక్ట్ చేస్తున్న ఆ ఇద్దరే బన్నీ, కొరటాల.

నిన్నటి నుండి మోస్ట్ ఎవైటింగ్ కాంబోగా హాట్ టాపిక్ అయిన  అల్లు అర్జున్, కొరటాల సినిమాతో వారి మిత్రులు నిర్మాతలుగా మారబోతున్నారు. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాతో నిర్మాతగా మారారు. అలాగే బన్నీ చిన్ననాటి స్నేహితులు శాండీ, స్వాతి, నట్టి లు సహ నిర్మాతలుగా పరిచయం అవుతుండటం విశేషం.

బన్నీ ‘పుష్ప’ తర్వాత , కొరటాల శివ ‘ఆచార్య’ తర్వాత చేయబోయే ఈ భారీ ప్రాజెక్ట్ ను తమ స్నేహితుల చేతిలో పెట్టడం ఒకరకంగా సాహసమే అనొచ్చు. మరి ఈ కొత్త నిర్మాతలు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ఎలా డీల్ చేస్తారో చూడాలి.