సోలో బ్రతుకే... సెప్టెంబర్ లో షూటింగ్

Sunday,August 02,2020 - 10:10 by Z_CLU

ఒక్క వారం రోజులు ఆగితే “సోలో బ్రతుకే సో బెటర్” సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేది. కానీ కరోనా ఆగలేదు. లాక్ డౌన్ తప్పలేదు. దీంతో లాస్ట్ మినిట్ లో షూటింగ్ ఆపేశారు.

అలా 3 నెలలుగా ఆగిపోయిన సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ పై హీరో సాయితేజ్ క్లారిటీ ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ లో ఈ సినిమా షూట్ స్టార్ట్ చేస్తామని ప్రకటించాడు.

ఒక్క వారం రోజులు షూట్ చేస్తే సినిమా రెడీ అయిపోతుందంటున్నాడు సాయితేజ్. ఆ తర్వాత కరోనా పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టు రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామని ప్రకటించాడు.

లెక్కప్రకారం ఈ సినిమా మే 1న రిలీజ్ అవ్వాలి. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే సినిమాకు సంబంధించి ఇప్పటివరకు షూటింగ్ పూర్తయిన పోర్షన్ మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయింది. బ్యాలెన్స్ షూట్ పూర్తయితే.. 2 వారాల్లో ఫస్ట్ కాపీ రెడీ అయ్యే ఛాన్స్ ఉంది.

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.