ItluMaredumilliPrajanikam టీజర్ టాక్

Thursday,June 30,2022 - 12:47 by Z_CLU

Allari Naresh’s ‘ItluMaredumilliPrajanikam’ Teaser Review

అల్లరి నరేష్ హీరోగా AR మోహన్ దర్శకత్వంలో జీ స్టూడియోస్ హాస్య మూవీస్ నిర్మిస్తున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టీజర్ రిలీజైంది. ఇటివలే ప్రీ టీజర్ తో సినిమా ఏ స్కేల్ లో ఉండబోతుందో చెప్పిన మేకర్స్ తాజాగా అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని టీజర్ రిలీజ్ చేశారు. నిమిషం 27 సెకన్లతో కట్ చేసిన టీజర్ తో సినిమా కథ గురించి క్లియర్ కట్ చెప్పే ప్రయత్నం చేసి కథనంపై ఆసక్తి కలిగించారు.

ఇవన్నీ ట్రైబల్ విలేజెస్ …వీళ్ళల్లో ఎక్కువ మంది జీవితం ఒక్కసారి కూడా ఓటు వేయని వాళ్ళే ఉన్నారు అంటూ వాయిస్ ఓవర్ తో స్టార్టయిన టీజర్ చూస్తే సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా అని అర్థమవుతుంది. కాకపోతే మారేడుమిల్లి అనే గ్రామం ఆ ఊళ్ళో ఉండే మనుషులు వారు చేసే పోరాటం , వారికి సపోర్ట్ చేసే హీరో ఇలా సినిమాలో చాలానే చూపించారని అర్థమవుతుంది.

“సాయం సేత్తే మనిషి, దాడి సేత్తే మృగం మేము మనుషులమే సారూ… మీరు మనుషులైతే సాయం చేయండి” అంటూ హీరోయిన్ ఆనంది చెప్పే డైలాగ్ తో పాటు “90 కిలో మీటర్ల ఫారెస్ట్ 150 కిలో మీటర్ల చుట్టూ కొలత , అక్కడికెళ్తే ఎవ్వరూ తిరిగి రాలేరు” అంటూ రవి ప్రకాష్ చెప్పే డైలాగ్ , “మాకు న్యాయం జరగకపోతే ఎవ్వరిని వదలం” అంటూ శ్రీ తేజ ఇంటెన్స్ తో చెప్పే డైలాగ్ , చివర్లో “పాతిక కిలో మీటర్ల ఇవతలికొస్తే గానీ వీళ్ళు ఇలా బ్రతుకుతున్నారని మనకి కూడా తెలియలేదు, వీళ్ళను చూస్తుంటే బాధ పడాలో , జాలి పడాలో కూడా తెలియట్లేదు మాస్టారూ” అని అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. పర్ఫెక్ట్ టీజర్ కట్ తో హీరో అల్లరి నరేష్ కి బర్త్ డే విషెస్ చెప్పారు మేకర్స్.

ఓవరాల్ గా ఎట్రాక్ట్ చేసే విజువల్స్ , కేరెక్టర్స్ , డైలాగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ని హిట్ చేసేసి సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజేష్ దండ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తుండగా , శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics