పాన్ తెలుగు సినిమా అనగానే నవ్వొచ్చింది.

Thursday,June 30,2022 - 01:15 by Z_CLU

Rajamouli Speech at Happy Birthday Trailer Launch event

లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే“. మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఓ ఈవెంట్ నిర్వహించి సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా హైదరాబాద్ లో ట్రైలర్ ఘనంగా రిలీజైంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ…మైత్రీ మూవీ మేకర్స్ అంటే మంచి ప్రాజెక్ట్స్ వెతికి పట్టుకుంటూ బంగారం తవ్వుకునే సంస్థ. హ్యాపీ బర్త్ డే కూడా ఆ సంస్థకు మరో పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ట్రైలర్ బ్లాక్ బస్టర్ గా ఉంది. చెర్రీకి సినిమా ప్రొడక్షన్ మీద చాలా అవగాహన ఉంది. ఆయన ఏ సంస్థకైనా అస్సెట్ లాంటి వారు. ఈ సినిమా చెర్రికి మంచి సక్సెస్ ఇవ్వాలి. దర్శకుడు రితేష్ కు తన సినిమాల మీద నమ్మకం ఎక్కువ. ట్రైలర్ లో పాన్ తెలుగు సినిమా అని చూడగానే నవ్వొచ్చింది. లావణ్య క్యారెక్టర్ బాగుంది. హీరోయన్స్ కు కథను ముందుండి నడిపే ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు. ఆమె బాగా నటించిందని అర్థమవుతుంది. ఇప్పుడున్న కమెడియన్స్ లో నాకు వెన్నెల కిషోర్, సత్య అంటే ఇష్టం. వాళ్లు టీజర్, ట్రైలర్ లో ఆకట్టుకునేలా ఉన్నారు. కామెడీ, థ్రిల్లర్ కలిపి చేయడం కష్టం. ఒకటి ఎక్కువైతే ఇంకొటి తగ్గిపోతుంది. రితేష్ వాటిని బాగా కంబైన్ చేసి ఉంటాడని తెలుస్తోంది. ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు అంటున్నారు కానీ నా అభిప్రాయం ప్రకారం మనసు పెట్టి కష్టపడి చేసిన ఏ సినిమానూ ప్రేక్షకులు వదులుకోరు. అలా కష్టపడాలని సూచిస్తున్నా. హ్యాపీ బర్త్ డేలో ఆ ప్రయత్నం జరిగిందని ఆశిస్తున్నా. అన్నారు.

 

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics