Allari Naresh 'నాంది' కాంబో రిపీట్

Monday,June 27,2022 - 03:05 by Z_CLU

Allari Naresh team up again with Naandi Director Vijay Kanakamedala

విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమైన ‘నాంది’ సినిమా అల్లరి నరేష్ కి మంచి ప్రశంసలు అందించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ గా కూడా సినిమా హిట్ అనిపించుకుంది. అందుకే తనకి  హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడికి మరోసారి అవకాశం ఇస్తున్నాడు అల్లరి నరేష్. ప్రస్తుతం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా చేస్తున్న అల్లరి నరేష్ నెక్స్ట్ విజయ్ కనకమేడలతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

తాజాగా ఈ కాంబో సినిమాను ప్రీ లుక్ పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశాడు దర్శకుడు విజయ్. వచ్చే నెల నుండి  రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.  టోటల్ షూట్ అంతా హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారు.  ఈ సినిమాకు ‘నాంది’కి పనిచేసిన టెక్నీషియన్సే వర్క్ చేయబోతున్నారు.

షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. #NareshVijay2 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్వరలోనే టైటిల్ ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. మరి ‘నాంది’ తో ఆడియన్స్ ని మెప్పించిన ఈ కాంబో రెండో సినిమాతో ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics