Chiru Maruthi Movie కన్ఫర్మ్ చేసిన మెగాస్టార్

Monday,June 27,2022 - 04:37 by Z_CLU

Chiranjeevi Confirms…  Mega Star – Maruthi Combo on cards

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సినిమాలతో పాటు బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న చిరు నెక్స్ట్ మారుతి డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ కాంబో సినిమా ఎప్పటి నుండి చక్కర్లు కొడుతుండగా తాజాగా ఈ న్యూస్ ని కన్ఫర్ చేసి క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్.

“చరణ్ బాబు స్నేహితులు విక్కీ ఒకరోజు నా దగ్గరికి వచ్చి మీతో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా అనుకుంటున్నామని అన్నాడు. వెంటనే నేను తప్పకుండా మారుతి మా కుర్రాడు నన్ను ఎలా మలచాలి ఎలా చూపించాలి అని ఒక అభిమాన దర్శకుడిగా మారుతికి బాగా తెలుసు అని అన్నాను. మారుతి కచ్చితంగా చేయగలడు ఆ నమ్మకం నాకుంది. వెంటనే శ్రీకారం చుట్టండి అన్నాను. మారుతీ మధ్యలో నువ్వు ఏ సినిమాలు చేస్తున్నా దాని మీద దృష్టి పెట్టు, వంశీ విక్కి ఏదైతే అనుకున్నారో దానికి నేను రెడీ” అంటూ మారుతి తో సినిమా కన్ఫర్మ్ చేశారు చిరు.

ఇక మెగా స్టార్ లిస్టులో మరో అభిమాన దర్శకుడు కూడా ఉన్నాడు. వెంకీ కుడుములతో కూడా చిరు ఓ సినిమా ఎనౌన్స్ చేసి ఉన్నారు. మరి ఆ సినిమా తర్వాత మారుతి మెగా స్టార్ సినిమా చేసే అవకాశం ఉంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics