బడా సినిమాల్లో కీ రోల్స్

Friday,November 09,2018 - 01:57 by Z_CLU

అల్లరి నరేష్ ,ఆర్యన్ రాజేష్ ఒకే సారి రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అయితే ఈసారి హీరోలుగా కాకుండా క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇప్పటికే అల్లరి నరేష్ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే లేటెస్ట్ గా మహేష్ మహర్షి సినిమాలో మహేష్ కి ఫ్రెండ్ గా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు అల్లరోడు.

ఇక నరేష్ అన్నయ్య ఒకప్పటి హీరో ఆర్యన్ రాజేష్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ ఐయాం బ్యాక్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. రామ్ చరణ్ -బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వినయ విధేయ రామ’ సినిమాలో చరణ్ కి అన్నయ్య గా నటిస్తున్నాడు ఆర్యన్ రాజేష్.

ఇలా ఇద్దరూ ఒకేసారి రెండు బడా సినిమాలతో బిజీ అయ్యారు. ఈ రెండు సినిమాలు మహేష్ ,చరణ్ కి ఎంత ఇంపార్టెంట్ అన్నది పక్కన పెడితే అల్లరి బ్రదర్స్ కి మాత్రం ఈ సినిమాలు  విజయం సాదించడం , క్యారెక్టర్స్ కి పేరు రావడం చాలా ముఖ్యం. మరి అన్నదమ్ములు ఈ సినిమాల్లో ఎలా మెప్పిస్తారో చూడాలి.