ఆఫీషియల్ : 'టాక్సీవాలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా అల్లు అర్జున్

Friday,November 09,2018 - 12:59 by Z_CLU

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘టాక్సీవాలా’. రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 17న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు మేకర్స్. నవంబర్ 11 న గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా ఎటెండ్ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.

గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘గీతగోవిందం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు కూడా బన్నీ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ తో టాక్సీవాలాకు కూడా బన్నీని ఆహ్వానించారు.

హైదరాబాద్ JRC కన్వెన్షన్ సెంటర్ లో ‘టాక్సీవాలా’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకను జీ సినిమాలు, జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్స్ లో లైవ్ లో చూడొచ్చు. జీ సినిమాలు యూట్యూబ్, వెబ్ సైట్ లో కూడా టాక్సీవాలా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లైవ్ కవరేజ్ ఉంటుంది.