అల వైకుంఠపురములో 5 రోజుల వసూళ్లు

Friday,January 17,2020 - 06:10 by Z_CLU

అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపుములో సినిమా ఏ ఏరియాలో తగ్గలేదు. వరుసగా 5వ రోజు ఈ సినిమాకు హౌజ్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో సిసలైన పండగ సినిమా అనిపించుకున్న బన్నీ మూవీ.. ఈ 5 రోజుల్లో వరల్డ్ వైడ్ 81 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. ఏపీ, నైజాంలో కలుపుకొని ఈ సినిమాకు 65 కోట్ల 84 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

విడుదలైన 4 రోజులకే కొన్ని ఏరియాస్ లో నాన్-బాహుబలి రికార్డులు సృష్టించిన ఈ సినిమా, తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. 5వ రోజుకే నైజాంలో 20 కోట్ల షేర్ క్రాస్ చేసిన మూవీగా నిలిచింది. ఈ లిస్ట్ లో బాహుబలి-2, సైరా, సాహో, ఖైదీ నంబర్ 150, సరిలేరు నీకెవ్వరు లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా కూడా చేరింది.

ఏపీ,నైజాం 5 రోజుల షేర్
నైజాం – రూ. 21.5 కోట్లు
సీడెడ్ – రూ. 10.04 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 9.03 కోట్లు
ఈస్ట్ – రూ. 5.45 కోట్లు
వెస్ట్ – రూ. 5.10 కోట్లు
గుంటూరు – రూ. 6.76 కోట్లు
కృష్ణా – రూ. 4.95 కోట్లు
నెల్లూరు – రూ. 2.65 కోట్లు