3 మిలియన్ క్లబ్ లో చేరిన అల వైకుంఠపురములో

Tuesday,January 21,2020 - 05:02 by Z_CLU

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో మరో ఫీట్ సాధించింది. ఈ సినిమా తాజాగా 3 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల తర్వాత ఇంత త్వరగా 3 మిలియన్ మార్క్ అందుకున్న సినిమా ఇదే.

తాజా వసూళ్లతో ఈ సినిమా శ్రీమంతుడు లైఫ్ టైమ్ కలెక్షన్లను క్రాస్ చేసి ఆరో స్థానంలో నిలిచింది. మరో 35 వేల డాలర్లు కలెక్ట్ చేస్తే.. సాహో, భరత్ అనే నేను సినిమాల్ని కూడా ఇది క్రాస్ చేస్తుంది. తన ఫైనల్ రన్ లో ఈ సినిమా 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించే అవకాశం ఉంది.

యూఎస్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్
1. బాహుబలి-2 – $ 20 మిలియన్
2. బాహుబలి-1 – $ 6.99 మిలియన్
3. రంగస్థలం – $ 3.51 మిలియన్
4. భరత్ అనే నేను – $ 3.41 మిలియన్
5. సాహో – $ 3.23 మిలియన్
6. అల వైకుంఠపురములో – $ 3.10 మిలియన్
7. శ్రీమంతుడు – $ 2.89 మిలియన్
8. సైరా – $ 2.60 మిలియన్
9. మహానటి – $ 2.54 మిలియన్
10. గీతగోవిందం – $ 2.46 మిలియన్