బాలీవుడ్ రీమేక్ గా కాటమరాయుడు

Saturday,September 02,2017 - 03:00 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు సినిమా త్వరలోనే హిందీలో రీమేక్ కానుంది. ఈ సినిమా రీమేక్ లో అక్షయ్ కుమార్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.నిజానికి కాటమరాయుడు కూడా స్ట్రయిట్ మూవీ కాదు. తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వీరమ్ సినిమాకు రీమేక్ ఇది. ఆ మూవీ స్ఫూర్తితోనే కాటమరాయుడు తెరకెక్కించారు. ఇప్పుడిదే సినిమా హిందీలో కూడా రీమేక్ కాబోతోంది.

సౌత్ సినిమా రీమేక్ రైట్స్ ను ఎక్కువగా తీసుకునే సాజిద్ నడియావాలా, కాటమరాయుడు రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. గతంలో పలు తెలుగు సినిమా హక్కుల్ని ఇతడే దక్కించుకున్నారు. సాజిద్-ఫర్హాద్ ఈ రీమేక్ ను డైరక్ట్ చేసే అవకాశం ఉంది.

గతంలో అక్షయ్ కుమార్ హీరోగా ఇట్స్ ఎంటర్ టైన్ మెంట్ అనే సినిమాను నిర్మించారు ఈ దర్శకులు. ఈసారి ఆ హీరోతో రీమేక్ ప్లాన్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన తమన్నానే రీమేక్ కోసం సంప్రదిస్తున్నట్టు టాక్.