రాజుగారి గది-2 పని పూర్తిచేసిన సమంత

Saturday,September 02,2017 - 04:02 by Z_CLU

పెళ్లికి టైం దగ్గరపడుతున్న వేళ.. చేతిలో ఉన్న సినిమాల్ని చకచకా పూర్తిచేస్తోంది సమంత. ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా వన్ బై వన్ ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేస్తోంది. ఇందులో భాగంగా రాజుగారి గది-2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసింది సమంత. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్టిల్ కూడా రిలీజ్ చేశారు.

నాగ్ మెంటలిస్ట్ గా నటిస్తున్న రాజుగారి గది-2 సినిమాపై చాలా అంచనాలున్నాయి. అయితే గతంలో వచ్చిన రాజుగారి గది సినిమాకు తాజాగా తెరకెక్కుతున్న రాజుగారి గది-2 సినిమాకు ఎలాంటి పోలికలు లేవు. కేవలం టైటిల్, దర్శకుడ్ని మాత్రమే రిపీట్ చేస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా

రాజుగారి గది-2 సినిమా దాదాపు పూర్తయింది. నాగార్జున బర్త్ డే సందర్భంగా కొన్ని స్టిల్స్ కూడా విడుదల చేశారు. అక్టోబర్ 13న సినిమాను థియేట్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. ఈ మూవీలో నాగ్ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. పీవీపీ బ్యానర్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.