అఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,July 26,2017 - 10:57 by Z_CLU

అక్కినేని చిచ్చరపిడుగు అఖిల్ నటిస్తున్న రెండో సినిమా శరవేగంగా ముస్తాబవుతోంది. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగార్జున నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 22న అఖిల్ రెండో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని స్వయంగా నాగార్జున ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు నాగ్

“అఖిల్ రెండో సినిమాకు సంబంధించి ఓ చిన్న బిట్ చూశాను. దర్శకుడు విక్రమ్ కుమార్, సినిమాటోగ్రాఫర్ వినోద్ మరోసారి మేజిక్ చేశారు. నాకు బాగా కలిసొచ్చిన డిసెంబర్ నెలలో, 22వ తేదీన అఖిల్ సినిమాను విడుదల చేయబోతున్నాం”. నాగ్ ట్వీట్ ప్రకటన ఇది.

ఈమధ్యే ఈ సినిమాలో నటించనున్న హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఒకప్పటి నటి లిజి కూతురు కల్యాణి, అఖిల్ సరసన హీరోయిన్ గా పరిచయమౌతోంది. మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఎక్కడ ఎక్కడ ఉందో తారక, జున్ను టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.