ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్

Wednesday,July 26,2017 - 10:06 by Z_CLU

ప్రెజెంట్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జై లవ కుశ’ సినిమాతో ఫుల్ బిజీ గా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత ఓ ముగ్గురు టాప్ డైరెక్టర్స్ తో తన డైరీ ని ఫిల్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కొరటాల -త్రివిక్రమ్ తో సినిమాలు కంఫర్మ్ చేసిన తారక్ జక్కన్నతో కూడా ఓ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు.


బాబీ డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘జై లవకుశ’ సినిమాను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలనీ చూస్తున్న తారక్ ఈ సినిమా ఫినిషింగ్ స్టేజికి రాగానే త్రివిక్రమ్ తో సెట్స్ పై వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను ‘హారిక & హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్ .రాధాకృష్ణ (చిన బాబు) నిర్మించనున్నాడు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ లో పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్.


త్రివిక్రమ్ తో సినిమా ఓ కొలిక్కి రాగానే తనకి ‘జనతా గ్యారేజ్’ తో  బిగ్గెస్ట్ హిట్ అందించిన కొరటాల శివ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తాడు ఎన్టీఆర్. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాతో నిర్మాతగా మారబోతున్నాడు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్. సో నెక్స్ట్ ఇయర్ లోనే ఈ కాంబో కూడా సెట్స్ పైకెళ్లే ఛాన్స్ ఉంది.


ఇక త్రివిక్రమ్ -కొరటాలతో సినిమాలు పూర్తవ్వగానే తన ప్రెస్టీజియస్ 30వ సినిమాను రాజమౌళి తో ప్లాన్ ప్లాన్ చేసుకుంటున్నాడట ఎన్టీఆర్. ఈ సినిమా గురించి అప్పుడప్పుడూ వీరిద్దరూ చర్చిస్తున్నారని, మళ్ళీ వీరి కాంబోలో తెరకెక్కే ఈ సినిమా చాలా గ్రాండియర్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.. సో ఈ మూడు సినిమాలు పూర్తయ్యాకే తన డైరీ లో నెక్స్ట్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడేమో తారక్..