Romantic రిలీజ్ డేట్ ఫిక్స్ !

Monday,March 01,2021 - 12:08 by Z_CLU

ఆకాష్ పూరి హీరోగా అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రొమాంటిక్’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ ఏడాది జూన్ 18 న సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.  యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. పూరి జగన్నాథ్ , ఛార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ కాశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాలో ఉన్న కొంత కంటెంట్ చూపించనున్నారు.  సినిమాలో ఆకాష్ -కేతిక మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ , రమ్య కృష్ణ నటన , మ్యూజిక్ హైలైట్ గా నిలవనున్నాయని ఇన్సైడ్ టాక్. మరి ఈ సినిమాతో పూరి తనయుడు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.