House Arrest పిల్లలతో కామెడీ

Monday,March 01,2021 - 12:29 by Z_CLU

’90ml’ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి , సప్తగిరి, రఘు కారుమంచి , తాగుబోతు రమేష్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘హౌజ్ అరెస్ట్’ టీజర్ రిలీజైంది. దొంగతనం చేయడానికి ఒక ఇంట్లో కెళ్ళిన నలుగురు వ్యక్తులను పిల్లలు బంధించి వారితో ఎలా ఆడుకున్నారు ? అనే కథాంశంతో సరదాగా సాగే కథనంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఉన్న మెయిన్ థీంను క్లియర్ కట్ చెప్తూ టీజర్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.

 పిల్లలతో కలిసి కుటుంబమంతా చూసే సినిమాగా ‘హౌజ్ అరెస్ట్’ ఉండనుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. ప్రైం షో ఎంటర్టైన్ మెంట్ బేనర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

“మిమ్మల్ని నవ్వించడానికి  మేం రెడీ… మాతో కలిసి నవ్వడానికి మీరు రెడీ నా ?” అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ ఫన్ ఎంటర్టైనర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.