అర్చన పెళ్లి డేట్ ఫిక్స్

Wednesday,October 30,2019 - 03:15 by Z_CLU

రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్న అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఈమె పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 13న అర్చన పెళ్లి జరగనుంది. ఈమెది డెస్టినేషన్ వెడ్డింగ్ కాదు. హైదరాబాద్ లోనే అర్చన పెళ్లి ఉంటుంది.

సరిగ్గా నెల రోజుల కిందట హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో అర్చన ఎంగేజ్ మెంట్ జరిగింది. ఓ హెల్త్ కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న జగదీశ్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లికి సిద్ధమైంది ఈ జంట. పెళ్లయిన మరుసటి రోజు భారీ రిసెప్షన్ ప్లాన్ చేశారు.

తపన అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది అర్చన. ఆ సినిమా నుంచే ఆమె వేదగా మారింది. అలా ఓ 10 సినిమాలు చేసిన తర్వాత, వేద పేరు స్థానంలో తన ఒరిజినల్ పేరుతోనే నటించడం స్టార్ట్ చేసింది. ఖలేజా, బలుపు, లయన్, పరమ వీర చక్ర, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో వేదకు మంచి గుర్తింపు వచ్చింది.

రీసెంట్ గా సప్తగిరి హీరోగా వచ్చిన వజ్రకవచధర సినిమాలో నటించింది వేద. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న లేడీ విలన్ గా మంచి పాత్ర పోషించింది. కాకపోతే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు పెద్దగా గుర్తింపురాలేదు. ఇప్పుడు పెళ్లితో జీవితంలో మరో ఫేజ్ లోకి ఎఁటర్ అవుతోంది వేద.