రామ్ హీరోగా రెడ్.. అఫీషియల్ లాంచ్

Wednesday,October 30,2019 - 12:50 by Z_CLU

RED అనే సినిమా చేయబోతున్నట్టు రీసెంట్ గా ప్రకటించాడు రామ్. ఇప్పుడా సినిమా అఫీషియల్ గా లాంఛ్ అయింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై వస్తోంది ఈ మూవీ. పూరి జగన్నాధ్, చార్మి కలిసి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించగా.. జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు.

కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోంది RED. మూవీ ఎనౌన్స్ మెంట్ రోజునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన యూనిట్, ఈరోజు మరో స్టిల్ ను కూడా విడుదల చేసింది. గతంలో కిషోర్ తిరుమల, రామ్ కాంబోలో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలొచ్చాయి. ఇప్పుడీ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా రాబోతోంది RED

ఇస్మార్ట్ శంకర్ తో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు రామ్. రీసెంట్ గా ఆ సినిమా హండ్రెడ్ డేస్ పూర్తిచేసుకుంది. అలా మొన్నటివరకు ఇస్మార్ట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే, తన కొత్త సినిమా మేకోవర్ పనిలో పడ్డాడు రామ్. షార్ట్ హెయిర్ స్టయిల్, రఫ్ గడ్డంతో సరికొత్తగా ముస్తాబయ్యాడు.