Acharya Motion Poster.. మెగా+మణి మేజిక్

Saturday,August 22,2020 - 05:18 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ ఫెయిల్ అయినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. చిరంజీవి సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఇచ్చాడంటే ఆ ఆల్బమ్ కేక పెట్టాల్సిందే. ఆచార్యతో కూడా ఈ కాంబినేషన్ మేజిక్ చేయబోతోంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ గా వచ్చింది Acharya Motion Poster.

ఆచార్య టైటిల్ అందరికీ తెలిసిందే. ఎటొచ్చి మోషన్ పోస్టర్ ఎలా ఉంటుంది… Chiranjeevi లుక్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ మాత్రమే అందర్లో ఉంది. ఆ అంచనాల్ని మరింత పెంచుతూ.. మోస్ట్ ఎగ్రెసివ్ లుక్ లో కత్తి పట్టుకొని నిల్చున్న చిరంజీవిని మోషన్ పోస్టర్ లో ప్రజెంట్ చేశారు.

ఈ లుక్ కు మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా ఫీల్ ను, హీరోయిజంను ఎలివేట్ చేస్తూ పెర్ ఫెక్ట్ గా బీజీఎం క్రియేట్ చేశారు Manisharma.

చిరంజీవి బర్త్ డే కానుకగా కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నట్టు ఈ మూవీ రిలీజ్ పై కూడా చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.