RRR ఎన్టీఆర్ , చరణ్ లతో అమీర్ డాన్స్ !

Monday,March 21,2022 - 01:47 by Z_CLU

AamirKhan shake legs with Jr Ntr , Ram Charan , Alia Bhatt in RRR Event Delhi

మొన్న కర్ణాటకలో అభిమానుల సమక్షంలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి గ్రాండ్ సక్సెస్ చేసుకున్న RRR టీం నిన్న డిల్లీలో కూడా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని ఇన్వైట్ చేశారు. ఇక ఈవెంట్ లో అమీర్ ఖాన్ స్పీచ్ తో పాటు ఎన్టీఆర్ , చరణ్ లతో కలిసి ఆయన వేసిన నాటు నాటు స్టెప్ వీడియో వైరల్ అవుతుంది. ఇంత ఫాస్ట్ గా ఈ స్టెప్ ఎలా వేశారని తారక్ , చరణ్ లను అమీర్ అడగ్గానే చాలా సులువే అంటూ ఆయనకీ స్టెప్ నేర్పించి స్టేజీపై చిందేశారు.

ఇక ఈవెంట్ లో రామ్ చరణ్ అమీర్ ఖాన్ కి ఫ్యాన్ అని చెప్తుండగా మైక్ లాక్కొని  అంతకంటే ముందు నేను మీ నాన్నకి ఫ్యాన్ అంటూ అమీర్ చెప్పుకోవడం మెగా ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. అమీర్ చిరంజీవి గురించి చెప్పిన ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏదేమైనా నిన్న డిల్లీ ఈవెంట్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచి RRR సినిమాను ప్రైజ్ చేశాడు అమీర్.

ఈరోజు రాజస్తాన్ లోని జైపూర్ లో మరో ఈవెంట్ చేయనున్నారు. 23 వరకూ రోజుకొకటి చెప్పున ఈవెంట్స్ ప్లాన్ చేశారు రాజమౌళి అండ్ టీం. 23న హైదరాబాద్ లో జరగనున్న ఈవెంట్ తో ప్రమోషన్స్ కి ఫులి స్టాప్ పెట్టనున్నారు. హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలయ్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని టాక్ వినబడుతుంది. అదే నిజమైతే మెగా , నందమూరి ఫ్యాన్స్ కి పండగే.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics