Radheshyam వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే

Monday,March 21,2022 - 03:03 by Z_CLU

పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ , క్యూట్ బ్యూటీ పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధే శ్యామ్‘ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మొదటి రోజు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ రెండో రోజు నుండి సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుకుంది. మార్చ్ 11న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పిరియాడిక్ లవ్ స్టోరి తొమ్మిది రోజులకు గానూ 200 కోట్ల మార్క్ కి చేరుకొని కలెక్షన్ల పరంగా సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది. మొదటి వారంలోనే వరల్డ్ వైడ్ గా 191 కోట్లు రాబట్టిన ‘రాధేశ్యామ్’ రెండో వారంలో రెండు రోజులకు గానూ 13 కోట్లకు పైగా వసూళ్ళు చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లు కొల్లగొట్టి ప్రభాస్ స్టామినా చాటుకున్నాడు. ముఖ్యంగా ఓవర్ సీస్ లో సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. లాంగ్ రన్ లో ఈ సినిమా కలెక్ట్ చేస్తుందో చూడాలి.

రాధే శ్యామ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 

మొదటి వారం – 191 .14 Cr

రెండో వారం 

మొదటి రోజు -6.70 Cr

రెండో రోజు – 6.90 Cr

మొత్తం – 204.77 Cr