Aakashavani : ఫ‌స్ట్ లుక్‌, రిలీజ్ చేసిన రానా

Monday,August 03,2020 - 01:50 by Z_CLU

ఇప్పుడంటే వినోద మాధ్య‌మాలు ఎక్కువైయ్యాయి కానీ.. ఒక‌ప్పుడు అంద‌రికీ ప్ర‌ధాన వినోద సాధనం రేడియోనే. దీనికి అచ్చ తెలుగు పేరు ఆకాశ‌వాణి. వార్త‌లు, పాట‌లు ఇలా అన్నీ విష‌యాల‌ను సామాన్యుల‌ను అందించే ఈ ‘ఆకాశ‌వాణి’ పేరుతో టాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతుంది.

ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను హీరో రానా ద‌గ్గుబాటి త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.

ఇదొక పీరియాడిక్ మూవీ. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.