ట్రయాలజీగా రానున్న 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌'

Monday,August 03,2020 - 01:43 by Z_CLU

న‌వీన్ పోలిశెట్టి టైటిల్ రోల్ పోషించిన ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాకుండా, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. త‌న సూప‌ర్బ్ ప‌ర్ఫార్మెన్స్‌తో అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు న‌వీన్‌.

టాలీవుడ్ షెర్లాక్ హోమ్స్ అన‌ద‌గ్గ ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ రానున్న రోజుల్లో మ‌రికొన్ని మిస్టీరియ‌స్ కేసుల్ని ఛేదించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రయాలజీ రాబోతోంది. అంటే మరో రెండు భాగాలన్నమాట.

డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నాజు. త‌ను డైరెక్ట్ చేస్తోన్న రెండో సినిమా పూర్త‌వ‌గానే ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ రెండో భాగం షూటింగ్ మొద‌ల‌వుతుంది.

ఈ సినిమా జ‌పాన్ భాష‌లో అనువాద‌మ‌వుతోంది. సెప్టెంబ‌ర్ 11న అక్క‌డ రిలీజ్ అవుతుంది.