'హలో' మూవీ రివ్యూ

Friday,December 22,2017 - 02:48 by Z_CLU

నటీనటులు : అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్, జగపతి బాబు,

మ్యూజిక్ : అనూప్ రూబెన్స్

మాటలు : కిట్టు విస్సప్రగడ, ఉషా రాణి

సినిమాటోగ్రాఫర్ – పీఎస్ వినోద్

నిర్మాణం : అన్నపూర్ణ స్టూడియోస్ & మనం ఎంటర్ ప్రైజెస్

నిర్మాత : నాగార్జున

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : విక్రం కుమార్

రిలీజ్ డేట్ – 22-12-2017

 

అఖిల్‌ హీరోగా విక్రం కుమార్ డైరెక్షన్ లో నాగార్జున నిర్మించిన ‘హలో’ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.. లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో ‘హలో’ అంటూ అఖిల్ ఎలా ఎంటర్ టైన్ చేసాడో.. చూద్దాం.

కథ :

చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీను, జున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరు? అవినాష్ – ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

 

నటీనటుల పనితీరు :

సినిమాలో అఖిల్ ఇరగదీశాడు. అన్ని విభాగాల్లో బెస్ట్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లో అఖిల్ నటన అదుర్స్. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్.. తన నేచురల్ పెర్ఫార్మెన్స్ , లుక్ తో ఆకట్టుకుంది. మాస్టర్ మికేల్, బాబి మైరా తమ నటనతో ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణ, జగపతి బాబు తమ క్యారెక్టర్స్ కి బెస్ట్ అనిపించుకుని సినిమాకు స్పెషల్ హైలైట్ గా నిలిచారు. అజయ్, మైకేల్ గాంధీ, కృష్ణుడు తదితరులు తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

టెక్నీషియన్స్ పనితీరు:

సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ లో ఇద్దరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. అందులో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్స్, మరొకరు సినిమాటోగ్రాఫర్ పి.ఎస్.వినోద్. వీళ్లిద్దరూ సినిమాకు మెయిన్ హైలైట్. అనుప్ అందించిన పాటల్లో ‘హలో’ అంటూ సాగే టైటిల్ సాంగ్ తో పాటు ‘మెరిసే మెరిసే’, ‘అనగనగ ఒక ఊరు’,’ఏవేవో’ అనే పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ చక్కని ఫీల్ తీసుకొచ్చాడు. పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. బాబ్ బ్రౌన్ కొరియోగ్రఫీ చేసిన హాలీవుడ్ రేంజ్ స్టంట్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. హైదరాబాద్ మెట్రోలో ఫస్ట్ టైం తీసిన యాక్షన్ ఎపిసోడ్ సూపర్. ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో కిట్టు, ఉషారాణి అందించిన మాటలు ఆకట్టుకున్నాయి. విక్రమ్ కుమార్ మేకింగ్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

జీ సినిమాలు సమీక్ష :

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో అఖిల్ సినిమా చేస్తున్నాడగానే హలో సినిమా పై పాజిటీవ్ బజ్ నెలకొంది. రీసెంట్ గా జరిగిన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ఏకంగా చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ రావడంతో మూవీపై హైప్ ఇంకా పెరిగింది.

సినిమా విషయానికొస్తే… కథ  సింపుల్ గా అనిపించినప్పటికీ తన మేకింగ్ స్టైల్ , ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో పాటు మరికొన్ని ఎలిమెంట్స్ జత చేసి మెస్మరైజ్ చేశాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఇప్పటికే ఇష్క్, మనం, 24 సినిమాలతో తన టాలెంట్ చూపించి, మేకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ మరోసారి అదే తరహాలో ‘హలో’ అంటూ ఓ బ్యూటిఫుల్ లవ్ & యాక్షన్ సినిమాతో ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా ఒకే రోజులో జరిగే కథకు యాక్షన్, ఎమోషన్ యాడ్ చేసి దర్శకుడిగా తన మార్క్ చూపించాడు.

అఖిల్ పెర్ఫార్మెన్స్, కళ్యాణి లుక్, లవ్ ట్రాక్, చైల్డ్ ఎపిసోడ్, యాక్షన్ పార్ట్, హాలీవుడ్ రేంజ్ స్టంట్స్, సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఫోన్ ఎపిసోడ్, అఖిల్ -కళ్యాణి మధ్య వచ్చే లవ్ సీన్స్, అఖిల్ -జగపతి బాబు- రమ్యకృష్ణ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్.

ఫైనల్ గా బ్యూటిఫుల్ లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా అందర్నీ అలరిస్తుంది ‘హలో’.

 

రేటింగ్ : 3.25 /5