ZeeCinemalu – Sep 8

Monday,September 07,2020 - 10:26 by Z_CLU

గీతాంజలి నటీనటులు : అంజలి, శ్రీనివాస్ రెడ్డి ఇతర నటీనటులు : మధునందన్, హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, ఆలీ, రావు రమేష్, సత్యం రాజేష్, శంకర్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ప్రవీణ్ లక్కరాజు డైరెక్టర్ : రాజ్ కిరణ్ ప్రొడ్యూసర్ : కోన వెంకట్ రిలీజ్ డేట్ : 8 ఆగష్టు 2014 అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గీతాంజలి. ఈ సినిమాలో అంజలి డ్యూయల్ రోల్ లో ఎంటర్ టైనర్ చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో ఇన్నోసెంట్ అమ్మాయిగా అంజలి నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది.

=======================

యువరాజు నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, జయసుధ, సుజాత ఇతర నటీనటులు : ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం, శ్రీధర్, బౌనా తదితరులు మ్యూజిక్ : డైరెక్టర్ చక్రవర్తి డైరెక్టర్ : దాసరి నారాయణ రావు ప్రొడ్యూసర్స్ : వెంకట్ అక్కినేని, నాగార్జున అక్కినేని రిలీజ్ డేట్ : 1982 ANR, జయసుధ, సుజాత నటించిన ట్రయాంగిల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ యువరాజు. సెంటిమెంట్, చక్రవర్తి మ్యూజిక్ ఈ సినిమాకి ఎసెట్.

===========================

బావ నటీనటులు : సిద్ధార్థ, ప్రణీత ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, సింధు తులాని మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి డైరెక్టర్ : రామ్ బాబు ప్రొడ్యూసర్ : పద్మ కుమార్ చౌదరి రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2010 అందమైన పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిందే బావ. ఈ సినిమాలో సిద్ధార్థ, ప్రణీత హీరోహీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ సిద్ధార్థ తండ్రి సీతారామ్ గా నటించాడు. నిజానికిఅసలు కథ సీతారామ్ దగ్గరి నుండే మొదలవుతుంది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న తను తన భార్య కుటుంబం నుండి తనను దూరం చేశాననే గిల్ట్ ఫీలిగ్ తో తను చేసిన తప్పు తన కొడుకుచేయకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో వీరబాబు(సిద్ధార్థ) ఒక అమ్మాయి ప్రేమలోపడతాడు. ఆ అమ్మాయి తన భార్య అన్న అకూతురు అని తెలుసుకున్న సీతారామ్, వీరబాబుతోతన ప్రేమను మర్చిపొమ్మంటాడు. అప్పుడు వీరబాబు ఏం చేస్తాడు..? కథ ఏ మలుపుతిరుగుతుందన్న అంశాలు జీ సినిమాలు లో చూడాల్సిందే.

==========================

గోరింటాకు నటీనటులు : రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్ ఇతర నటీనటులు : ఆకాష్, హేమ చౌదరి,సుజిత, శివ రాజా, మాస్టర్ నిధీశ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్ డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్ ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్, పారస్ జైన్ రిలీజ్ డేట్ : జులై 4 , 2008 అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, అన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

==========================

యోగి నటీనటులు : ప్రభాస్, నయన తార ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల డైరెక్టర్ : V.V. వినాయక్ ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి రిలీజ్ డేట్ : 12 జనవరి 2017 ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.