Zee Cinemalu 5th Anniversary Anthem

Saturday,September 04,2021 - 01:12 by Z_CLU

ప్రతీ రోజు వరుస సినిమాలతో అదిరిపోయే ఎంటర్టైన్ మెంట్ అందిస్తూ వస్తున్న జీ సినిమాలు నేడు 5th Anniversary జరుపుకుంటుంది. ఐదేళ్ళ నుండి ప్రతి రోజు ఆరు విభిన్న సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూ వారిని ఎంటర్టైన్ మెంట్ లో ముంచెత్తుతున్న జీ సినిమాలు ప్రేక్షకుల ఆదరణతో మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. తక్కువ టైంలో సక్సెస్ ఫుల్ ఛానెల్ గా పేరొందిన జీ సినిమాలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపారు. ఈ శుభదినాన్ని పురస్కరించుకొని జీ సినిమాలు కి సంబంధించి ఈరోజు బ్రాండ్ ఆంథెమ్ విడుదల చేశారు.

లేటెస్ట్ సెన్సేషనల్ సింగర్ రామ్ మిర్యాల ఈ సాంగ్ ని స్వయంగా కంపోజ్ చేసి పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ హంగామా చేస్తుంది. రామ్ మిర్యాల సింగింగ్ తో పాటు శ్వేత అందించిన లిరిక్స్ హైలైట్ గా నిలిచాయి.

ఇకపై జీ సినిమాలు ఛానెల్ గురించి మాట్లాడుకుంటే ఈ సాంగే గుర్తొచ్చేలా బ్రాండ్ ఆంథెమ్ ని కంపోజ్ చేశారు రామ్ మిర్యాల.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics