Sundeep Kishan Interview about ‘A1 Express’!

Wednesday,March 03,2021 - 04:45 by Z_CLU

తన ప్రతీ సినిమాను ఒక్కో జానర్ లో చేస్తూ వస్తున్న హీరో సందీప్ కిషన్ ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా కథతో 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా చేశాడు. హాకీ నేపథ్యం తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 5న శుక్రవారం థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ సినిమా గురించి మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు సందీప్ మాటల్లోనే ....

 

నాకు మైలు రాయి 

ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. 'A 1 ఎక్స్ ప్రెస్' నా కెరీర్లోనే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా. అన్ని ఎలిమెంట్స్ ఉన్న కథ ఇది. కచ్చితంగా అందరికి నచ్చుతుంది.

ఐడియా మాత్రమే

తమిళ్ లో హిపాప్ తమిళ చేసిన 'నాట్పే తుణై' సినిమాకు ఇది రీమేక్. కానీ ఐడియా మాత్రమే తీసుకున్నాం. ఒరిజినల్ కి A1 ఎక్స్ ప్రెస్ కి చాలా తేడా ఉంటుంది. హీరో హిపాప్ తమిళ కూడా అదే అన్నాడు.

 

ఆరు నెలల ట్రైనింగ్ 

ఈ సినిమా కోసం ఆరు నెలల పాటు హాకీ ట్రైనింగ్ తీసుకున్నా. స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేసేటప్పుడు కచ్చితంగా ఆ స్పోర్ట్ లో ప్రావిణ్యం ఉండాలి. బేసిక్ గా అన్ని తెలిసి ఉండాలి. ముందే హాకీ నేర్చుకొవడం వల్ల షూట్ లో నా పని ఈజీ అయింది. సినిమాలో సందీప్ కనిపించడు. హాకీ ప్లేయర్ మాత్రమే  కనిపిస్తాడు.

గ్రౌండ్ కోసం 

స్పోర్ట్స్ డ్రామాలో చాలా విషయాలు చెప్పొచ్చు. ఇందులో కూడా మేము చాలా విషయాలు చెప్పాము. ముఖ్యంగా గ్రౌండ్ కి సంబంధించి కొన్ని సన్నివేశాలుంటాయి. అలాగే మన స్పోర్ట్స్ పర్సన్స్ కి అందాల్సిన గౌరవం దక్కట్లేదని స్ట్రాంగ్ గా చూపించాం. ఆ సన్నివేశాలు చూసి నిజమే కదా అని ప్రతీ ప్రేక్షకుడికి ఫీలవుతాడు.

 చాలా జాగ్రత్తలతో 

లాక్ డౌన్ తర్వాత చండీఘర్ వెళ్లి అక్కడ క్లైమాక్స్ ఎపిసోడ్స్ షూట్ చేశాం. చాలా జాగ్రత్తలతో షూట్ చేసుకొచ్చాం. రేపు థియేటర్స్ లో ఆ స్టేడియంలో వచ్చే సీన్స్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తాయి.

నేషనల్ ప్లేయర్స్ తో

సినిమాలో నేషనల్ హాకీ ప్లేయర్స్ నటించారు. కొన్ని సీన్స్ వాళ్ళతో చేయిస్తే ఇంపాక్ట్ ఉంటుందని భావించాం. రెండు మూడు గంటల మాత్రమే మ్యాచ్ ఆడే వాళ్ళు మా సినిమా కోసం పొద్దున్న నుండి సాయంత్రం వరకు కేటాయించారు. అందుకు వారు తీసుకున్న పారితోషకం కూడా తక్కువే జస్ట్ 5000 వేలు మాత్రమే అడిగారు.

స్పోర్ట్స్ సినిమా కష్టం 

నిజానికి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయడం చాలా కష్టం. స్టేడియంలో బాల్ ని ఫాలో అవుతూ షాట్స్ తీయాల్సి ఉంటుంది. ప్రతీ షాట్ ని చాలా కేర్ఫుల్ గా తెరకెక్కించాలి. అందుకే స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు మనకి ఎక్కువ రావు. దాని వెనుక కష్టం మాములుగా ఉండదు. కానీ సినిమా బాగుంది బాగా ఆడితే ఆ కష్టం మర్చిపోతాం.

మ్యూజిక్ హైలైట్ 

సినిమాలో సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుంది. హిపాప్ తమిళ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే తన మ్యూజిక్ సినిమా మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చింది.

స్ట్రాంగ్ ఎమోషన్ 

సినిమా స్పోర్ట్స్ బేస్డ్ అయినప్పటికీ కథలో మంచి ఎమోషన్ ఉంటుంది. లవ్ ట్రాక్ , సాంగ్స్ , కామెడీ వీటితో పాటు స్ట్రాంగ్ ఎమోషన్, చక్కని మెసేజ్ కూడా ఉంటుంది.

గర్వపడ్డారు 

చోటా మామ ఫంక్షన్లో ఎమోషనల్ అయ్యారు. బేసిక్ గా ఆయన నా కెరీర్ చూసి సంతోషపడుతున్నారు. ఇలాంటి సినిమా నేను చేసినందుకు ఆయన చాలా గర్వపడ్డారు. అది ఆయన మాటల్లో నేను గమించా. ఆయన సపోర్ట్ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ ఉంటాయి.

ఇలాంటి నిర్మాతలు అవసరం 

నా కెరీర్ లోనే హై బడ్జెట్ సినిమా ఇది. కథతో పాటు నన్ను నమ్మి ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రొడ్యూసర్స్ నిర్మించారు. కంటెంట్ మీద నమ్మకంతో బడ్జెట్ పెరుగుతున్నా పట్టించుకోకుండా సినిమాను నిలబెట్టారు.ఈ సందర్భంగా మా నిర్మాతలు విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, ద‌యా ప‌న్నెం నా స్పెషల్ థాంక్స్.  ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం.

 

నెక్స్ట్ అవే 

ప్రస్తుతం G.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్ లో చేస్తున్న 'రౌడీ బేబీ' షూటింగ్ స్టేజిలో ఉంది. సత్యతో 'వివాహ భోజనంపు' సినిమా నిర్మించాను. అందులో నా కామియో ఉంటుంది. మహేష్ కోనేరు నిర్మాణంలో వేదవ్యాస్ అనే దర్శకుడితో ఒక సినిమా అలాగే వివాహ భోజనంబు డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో ఇంకో చేయబోతున్నాను.