Movie “A” Rapid Cut Trailer becomes viral

Wednesday,March 03,2021 - 03:42 by Z_CLU

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని హీరోహీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై గీతా మిన్సాల నిర్మించిన చిత్రం ‘A’. డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ప్రోమోస్, ట్రయిలర్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీ ట్రయిలర్ ను విజయ్ సేతుపతి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రాపిడ్ కట్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

‘యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగిరాలేనిదైనా నాకు సంతోషమే..’’ అంటూ ఇంటెన్స్ డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. అంతేకాదు సినిమా ఏ రేంజ్‌లో తెరకెక్కిందో తెలిపేలా ఉంది.

డిఫరెంట్ మూవీస్ కోరుకునే ప్రేక్షకులకు A మూవీ కచ్చితంగా నచ్చుతుందంటున్నాడు డైరక్టర్ యుగంధర్. మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని PVR పిక్చర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది.