Writer Sai Madhav Burra words about ‘Sreekaram’

Wednesday,March 03,2021 - 05:45 by Z_CLU

ఆయన పెన్ పేపర్ పై పెట్టి డైలాగులు రాస్తే అవి నేరుగా ప్రేక్షకుల గుండెల్లోకి చేరిపోతాయి. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలకు కూడా ఆయన కలం బలం చూపిస్తూ పని చేస్తుంటారు. ఆయనే రైటర్ సాయి మాధవ్ బుర్రా. ఈ స్టార్ రైటర్ పనిచేసిన 'శ్రీకారం' సినిమా మార్చ్ 11న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా ఆ సినిమా సంగతులను ఆయన మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు సాయి మాధవ్ మాటల్లోనే...

 

'శ్రీకారం' దమ్మున్న కథ 

కొన్ని కథలు వినగానే ఈ సినిమాకి కచ్చితంగా పని చేయాల్సిందే అనిపిస్తుంది. 'శ్రీకారం' అలాంటి దమ్మున్న కథ . మాటలకి చాలా ప్రాముఖ్యత ఉన్న సినిమా ఇది. అందుకే కిషోర్ నాకు స్క్రిప్ట్ చెప్పగానే ఈ సినిమాకి నేను రాస్తున్నా అని చెప్పేశాను.

శర్వాతో రెండో సారి 

హీరో శర్వానంద్ తో నాకిది రెండో సినిమా. మా కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లో డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ సినిమా నాకు రైటర్ గా మంచి పేరు తీసుకొచ్చింది. మళ్ళీ శర్వాతో 'శ్రీకారం' సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కూడా మా కాంబోలో మరో సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నా.

 

అతనికి మంచి పేరొస్తుంది. 

ఈ సినిమాను డైరెక్ట్ చేసిన కిషోర్ కి చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతోనే అందరితో వర్క్ చేయించుకొని బెస్ట్ అవుట్ పుట్ తీసుకున్నాడు. సినిమా విడుదలయ్యాక అతనికి మంచి పేరొస్తుంది.

 

చెప్పాల్సిన కథ 

కొన్ని కథలు ఎన్ని సార్లు చెప్పిన మళ్ళీ స్ట్రాంగ్ గా చెప్తే ఆకట్టుకుంటాయి. మళ్ళీ ఒక్కసారి  అందరికీ చెప్పాల్సిన రైతు కథ ఇది. రైతు మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో అరాకొరా మినహా అన్నీ బాగా ఆడాయి. వ్యవసాయం గొప్పదనం చెప్పే 'శ్రీకారం' కూడా మంచి విజయం అందుకుంటుందని నా నమ్మకం. అందరూ చూడాల్సిన మంచి సినిమా ఇది.

 

ఇంకా చాలా ఉన్నాయి. 

టీజర్ లో డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఇంకా అలాంటి డైలాగులు చాలా ఉన్నాయి. అవన్నీ రేపు స్క్రీన్ పై ఎంజాయ్ చేస్తూ ఆలోచింప జేసేలా ఉంటాయి.

క్రాక్ మంచి ఉత్సాహం అందించింది 

రైటర్ గా  పనిచేసిన రీసెంట్ సినిమా 'క్రాక్' నాకు మళ్ళీ మంచి పేరు తెసుకొచ్చింది. ఆ సక్సెస్ ని శ్రీకారం కూడా కంటిన్యూ చేస్తుందని నమ్ముతున్నా.

 

నెక్స్ట్ సినిమాలు అవే 

ప్రస్తుతం  'RRR', క్రిష్ -పవన్ కళ్యాణ్ సినిమా , నాగ్ అశ్విన్ -ప్రభాస్ సినిమాకు రైటర్ గా పనిచేస్తున్నా. ఈ సినిమాలు రైటర్ గా నా స్థాయిని మరింత పెంచుతాయని భావిస్తున్నా.