Sharwanand, Siddharth’s ‘Mahasamudram’ Begins!

Monday,December 07,2020 - 03:59 by Z_CLU

శర్వానంద్ , సిద్దార్థ్ లతో 'RX100' దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న 'Maha Samudram' సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రస్తుతం రావు రమేష్ మిగతా నటీ నటులపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. రెండు రోజుల్లో సిద్దార్థ్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడని తెలుస్తుంది.

ఈ నెలాఖరు వరకు యూనిట్ హైదరబాద్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తారు. ఆ తర్వాత గోవాలో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యుల్ నుండి శర్వానంద్ జాయిన్ అవుతాడని సమాచారం. శర్వానంద్ - సిద్దార్థ్ కాంబోలో వస్తున్న సినిమా కావడం , పైగా లాంగ్ గ్యాప్ తర్వాత సిద్దార్థ్ తెలుగులో నటిస్తున్న సినిమా అవ్వడంతో  సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంటుంది.

Ak ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో అదితి రావు , అను ఇమ్మానుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.