సిద్దార్థ్

Monday,December 07,2020 - 03:20 by Z_CLU

సిద్దార్థ్ ప్రముఖ కథానాయకుడు… పూర్తి పేరు సిద్దార్థ్ సూర్యనారాయన్. తెలుగు , తమిళ్, హిందీ, మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. ఏప్రిల్ 17,1979 లో జన్మించాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాయ్స్’ సినిమాతో తమిళ్ , తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా తర్వాత తమిళ్ లో ‘అయుత ఎళుతు’ సినిమాలో నటించాడు. ఈ సినిమా ‘యువ’ టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ‘నువ్వొస్తానంటే నేనోద్దంటానా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సిద్దార్థ్. ఈ సినిమాతో మంచి విజయం అందుకున్న సిద్దార్థ్ ‘బొమ్మరిల్లు’ తో మరో ఘన విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఆట’,’ఓయ్’,’చుక్కల్లో చంద్రుడు’,’కొంచెం ఇష్టం కొంచెం కష్టం’,’బావ’.’అనగనగా ఒక ధీరుడు’,’ఓహ్ మై ఫ్రెండ్’,’జబర్దస్త్’ వంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. ఎన్టిఆర్ హీరోగా తెరకెక్కిన ‘బాద్ షా’ లో ఓ అతిధి పాత్రలో నటించాడు. ప్రస్తుతం తమిళ్లో  కథానాయకుడిగా బిజీ అయ్యాడు సిద్దార్థ్.