RRR Targets Sankranthi 2022

Sunday,August 23,2020 - 12:34 by Z_CLU

NTR, RamCharan నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ 'RRR' సంక్రాంతి టార్గెట్ ఏంటి..? ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న ఈ భారీ బడ్జెట్ సినిమా నాలుగు నెలల్లో అన్ని పూర్తి చేసుకొని థియేటర్స్ లోకి రావడమా..? అదెలా కుదురుతుంది..? అనుకుంటున్నారా..?

అవును నిజమే... ఈ సినిమాను సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కి రెడీ చేసే ఆలోచనలో ఉన్నారు జక్కన్న అండ్ టీం. అయితే అదే వచ్చే ఏడాది సంక్రాంతి కాదు. 2022 Sankranthi. అంటే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా ఏడాది పైనే పడుతుంది.

లేటెస్ట్ గా Rajamouli ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ షూటింగ్ పూర్తయ్యాక కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఆరేడు నెలలు పడుతుందని స్పష్టం చేశాడు. బాహుబలి-2 తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలున్నాయి. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కోసమే ఎక్కువ నెలలు కేటాయించబోతున్నాడు జక్కన్న. ఈ లెక్క ప్రకారం షూటింగ్ పూర్తయ్యి వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

అంటే వచ్చే ఏడాది మొత్తం షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కేటాయించి ఈ ఏడాది అనుకున్న సంక్రాంతి కాకుండా ఆ పై వచ్చే సంక్రాంతి సీజన్ కి సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని భావిస్తున్నారట. ఈ లోపు ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తగ్గి పరిస్థితులు చక్కబడే అవకాశం ఉంది కాబట్టి కలెక్షన్స్ కి ఢోకా ఉండదని అనుకుంటున్నారట మేకర్స్.