Ram Charan gives a clarity on his role in ‘Acharya’

Monday,April 25,2022 - 11:42 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి  , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య' మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా సినిమాలో తన రోల్ రన్ టైం బయట పెట్టాడు చరణ్. 'ఆచార్య' రామ్ చరణ్ కనిపించేది కేవలం 40 నిమిషాలు మాత్రమేనట.

ముందుగా కథలో సిద్ద అనే పాత్రను 15 నిమిషాల నిడివితో రాసుకున్నాడట కొరటాల. కానీ చరణ్ ని దృష్టిలో పెట్టుకొని కేరెక్టర్ ఇంపార్టెన్స్ తో పాటు రన్ టైం కూడా పెంచి ఫైనల్ గా 40 నిమిషాలు లాక్ చేసుకున్నారట. నిజానికి చరణ్  చేయలేకపోతే ఓ స్టార్ హీరోతో సిద్ద పాత్రను చేయించాలని కొరటాల , చిరు భావించారు. కానీ చిరు సతీమణి సురేఖ గారి కోరిక బలమైనది కావడంతో ఫైనల్ గా ఈ కేరెక్టర్ చరణ్ కే దక్కింది.

'ఆచార్య' లో చరణ్ కనిపించేది నలబై నిమిషాలే అయినప్పటికీ ఆ పాత్ర చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం ఖాయమని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఇక చిరు , చరణ్ ఈ పాత్రలతో ఎలా కలుస్తారు ? వీరిద్దరికి సినిమాలో ఎలాంటి రిలేషన్ ఉంటుంది ? అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీటి గురించి మాత్రం టీం ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'ఆచార్య' ఏప్రిల్ 29 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics