NTR to team up with AR Rahman and Anirudh for his next movies ?

Saturday,April 23,2022 - 02:55 by Z_CLU

కొన్ని కాంబినేషన్స్ లో అదిరిపోయే ఆల్బం వస్తుందని , వాటిని వింటూ ఎంజాయ్ చేయొచ్చని ఫ్యాన్స్ ముచ్చట పడుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆ ఫ్యాన్స్ కోరుకుంటున్న క్రేజీ కాంబో ఎన్టీఆర్ -అనిరుద్. అవును ఎప్పటి నుండో ఈ ఇద్దరి కాంబో సినిమా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. అయితే అభిమానులు గట్టిగా కోరుకోవడం వలనో ఏమో కానీ ఎట్టకేలకు ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయిందని తెలుస్తుంది. అవును ఎన్టీఆర్ , కొరటాల కాంబినేషన్ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడని సమాచారం. ఇంకా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు కానీ, దాదాపు ఈ పాన్ ఇండియా సినిమాకి అనిరుద్ ఫిక్సయినట్టే, తారక్ కోసం అదిరిపోయే సాంగ్స్ రెడీ అవుతున్నట్టే అంటున్నారు.

ఇక మరో కాంబో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అదే ఎన్టీఆర్ -రెహ్మాన్ కాంబో. ఎన్టీఆర్ లైనప్ లో బుచ్చి బాబు సినిమా కూడా ఉంది. ఇటివలే 'పెద్ది' అనే స్పోర్ట్స్ డ్రామా స్క్రిప్ట్ వినిపించి తారక్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట బుచ్చి బాబు. ఈ ప్రాజెక్ట్ కోసం రెహమాన్ మ్యూజిక్ అనుకుంటున్నారు. ఇటివలే రెహ్మాన్ ని అప్రోచ్ అయినట్టు సమాచారం. నిజానికి రెహ్మాన్ తో ఓ సినిమా చేయాలని ప్రతీ హీరోకి ఉంటుంది. అలాగే తారక్ కి కూడా ఆ కోరిక ఉందని తనే రెహ్మాన్ ని సజిస్ట్ చేశాడని టాక్.

ఇలా టాప్ లో ఉన్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పేర్లు తారక్ సినిమాకు గట్టిగా వినబడుతున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ వస్తుందేమో చూడాలి.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics