Here’s the Reason behind Kajal’s role removed from ‘ACHARYA’

Monday,April 25,2022 - 12:24 by Z_CLU

మోస్ట్ ఎవైటింగ్ కాంబో మూవీ 'ఆచార్య' ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవుతుంది. ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమా గురించి నిన్నటి వరకూ అందరిలో ఉన్న ఓ సందేహానికి సమాధానం దొరికింది. సినిమాలో అసలు కాజల్ ఉందా ? ఉంటే ట్రైలర్ లో ఎందుకు చూపించలేదు ? ఇదే ప్రస్తుతం అందరిలో ఉన్న క్వశ్చన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కొరటాల శివ.

మొదట సినిమా అనుకున్నప్పుడు హీరోకి కచ్చితంగా హీరోయిన్ ఉండాలి అనుకుంటాం. అందులో భాగంగా ధర్మస్థలి లో ఉండే ఓ ఫన్నీ కేరెక్టర్ పుట్టింది. కానీ సినిమాలో ఆచార్య పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఉండకూడదు. ఆ డౌట్ మొదటి నుండి ఉండేది. కానీ కమర్షియల్ ఫార్మెట్ లో ఆలోచించి  ఫస్ట్ షెడ్యుల్ లో ఓ మూడు రోజుల పాటు కాజల్ మీద కొన్ని సీన్స్ తీశాం. కానీ ఫూటేజ్ చూశాక అంత పెద్ద హీరోయిన్ ని పెట్టి ఏదో కమర్షియాలిటీ  కోసం ఇరికించి కేరెక్టర్ పెట్టకూడదు అనిపించింది. పైగా హీరోకి లవ్ ఇంట్రెస్ట్ లేదు, దీంతో పాటలు పెట్టలేము. సో ఆ కేరెక్టర్ ని ప్రాపర్ గా కంక్లూజ్ చేయలేమని భావించాను. ఈ విషయాన్ని చిరంజీవి గారితో పంచుకుంటే ఆయన నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయమని, ఇంపార్టెన్స్ లేకపోతే అందరితో మాట్లాడి ఆ రోల్ తీసేయమని అన్నారు. ఆ తర్వాత కాజల్ కి ఇదంతా ఎక్స్ ప్లేన్ చేస్తే చెప్పగానే తను నవ్వింది. సినిమాను మిస్ అయిన విషయం చెప్తూ మళ్ళీ కలిసి వర్క్ చేద్దామని చెప్పింది. కానీ ఇంత ఆలోచించి డిసీషన్ తీసుకున్నందుకు థాంక్యూ కూల్ గా స్పందించింది." అంటూ అసలు విషయం చెప్తూ క్లారిటీ ఇచ్చారు కొరటాల.

ఇప్పుడు మూవీ లవర్స్ లో ఉన్న ప్రశ్నకి ఫైనల్ గా రిలీజ్ కి ముందే సమాధానం లభించింది. సో 'ఆచార్య' లో  పూజ హెగ్డే మాత్రమే సోలో హీరోయిన్ గా కనిపించనుంది.

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics