Press Release From The Team of Acharya

Thursday,August 27,2020 - 05:11 by Z_CLU

ఆచార్య సినిమాకు సంబంధించి గడిచిన 2 రోజులుగా వివాదం చెలరేగిన సంగతి అందరికీ తెలిసిందే. Chiranjeevi-Koratala కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ కాపీ అంటూ ఓ రైటర్ ఆరోపణలు చేస్తున్నాడు. దీనిపై ఈరోజు Acharya యూనిట్ రియాక్ట్ అయింది.

సోషల్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లో వస్తున్నట్టు ఆచార్య కథ కాపీ కాదంటూ ప్రకటన విడుదల చేసింది మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ. ఆచార్య కథ పూర్తిగా కొరటాల శివ ఆలోచనల నుంచి రూపుదిద్దుకుందని, కథనం కూడా పూర్తిగా ఒరిజినల్ అని ప్రకటించింది ఈ సంస్థ.

Chiranjeevi Birthday సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చినట్టు తెలిపిన "మ్యాట్నీ" సంస్థ.. కేవలం మోషన్ పోస్టర్ చూసి కథ తమదే అంటూ కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

Acharya Movie స్టోరీ కేవలం కొంతమందికి మాత్రమే తెలుసంటున్న సదరు నిర్మాణ సంస్థ.. ప్రస్తుతం మీడియాలో వినిపిస్తున్న కథనాలన్నీ బేస్ లెస్ అంటూ కొట్టిపారేసింది.

ఆచార్య కథ తనదే అంటూ రాజేష్ అనే వ్యక్తి మీడియాకెక్కాడు. బి.గోపాల్ వద్ద కొన్నాళ్ల పాటు అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఈ వ్యక్తి.. "పెద్దాయన" పేరిట ఓ స్క్రిప్ట్ రాసుకున్నాడట. బాలయ్యతో సినిమా చేద్దామనే ప్రయత్నంలో ఆ కథను మైత్రీ మూవీ మేకర్స్ కు వినిపించాడట. తను కథ చెబుతున్నప్పుడు వాళ్లు రికార్డ్ చేశారని.. ఆ కథతోనే ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్నారని ఈయన ఆరోపిస్తున్నాడు.