Chiranjeevi-Rajamouli movie on cards ?

Saturday,April 23,2022 - 10:03 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో చిరు -రాజమౌళి కాంబో మూవీ హాట్ టాపిక్ గా మారింది. అవును త్వరలోనే మెగాస్టార్ ని రాజమౌళి డైరెక్ట్ చేసే అవకాశం ఉందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటివలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మీటింగ్స్ లో భాగంగా రాజమౌళి మెగాస్టార్ తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఒక రకంగా చిరు మంచి తనానికి , ఇండస్ట్రీ కి అందించిన మెగా సపోర్ట్ కి జక్కన్న ఫిదా అయిపోయాడు. ఈ విషయాన్ని RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా తనే చెప్పుకున్నాడు.

అయితే ఇటివలే వీరిద్దరి మధ్య ఓ సినిమా గురించి కూడా డిస్కషన్ నడిచిందని అంటున్నారు. మెగాస్టార్ తో రాజమౌళి సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడని , మహేష్ సినిమా తర్వాత జక్కన్న చిరుతో సినిమా చేసే అవకాశం ఉందని, అంతా అనుకున్నట్లు జరిగితే ఇవ్వాళ జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కాంబో సినిమా అనౌన్స్ చేసే చాన్స్ ఉందని టాక్ గట్టిగా వినబడుతుంది.

గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' లో ఓ స్పెషల్ సీన్ లో కనిపించాడు చిరు. ఆ సినిమాలో ఓ ఇంపార్టెన్స్ సీన్ పెట్టి మెగాస్టార్ ని డైరెక్ట్ చేశాడు రాజమౌళి. ఆ సీన్ ని థియేటర్స్ లో మెగా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ కాంబోలో సినిమా అంటే మెగాఫ్యాన్స్ కి పండగే మరి. అసలు ఈ కాంబో న్యూస్ లో నిజమెంత ? అనేది  ఇవ్వాళ సాయంత్రం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తేలిపోతుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics