Back to back updates from Chiranjeevi Movies

Saturday,August 21,2021 - 04:03 by Z_CLU

రేపు చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 4 సినిమాల అప్ డేట్స్ వస్తున్నాయి. అవేంటో చూసేద్దాం..

ముందుగా చిరంజీవి-మోహన్ రాజా మూవీ (#Chiru153) అప్ డేట్ రాబోతోంది. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. మరికొద్ది సేపట్లో ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్ రాబోతోంది. దీనికి సుప్రీమ్ రివీల్ అనే పేరు పెట్టారు. మలయాళంలో పెద్ద హిట్టయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ ఇది.

ఇక రేపు ఉదయం 9 గంటలకు చిరంజీవి సినిమాల నుంచి మరో అప్ డేట్ రాబోతోంది. చిరు-మెహర రమేష్ కాంబోలో రాబోతున్న వేదాళం రీమేక్ కు సంబంధించిన అప్ డేట్ ఇది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కీర్తిసురేష్ ను తీసుకున్నట్టు గాసిప్స్ వచ్చాయి. అన్నీ అనుకున్నట్టు కుదిరితే అదే అప్ డేట్ ను రేపు రివీల్ చేయొచ్చు.

ఇక రేపు సాయంత్రం మరో మెగా అప్ డేట్ రాబోతోంది. చిరంజీవి-బాబి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అప్ డేట్ ఇది. ఆచార్య తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్రెష్ స్టోరీ ఇదే. మిగతా రెండూ రీమేక్సే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్ ను రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు రివీల్ చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్.

chiranjeevi acharya (1)

వీటితో పాటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఆచార్య సినిమా నుంచి మరో సర్ ప్రైజ్ రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజైంది. రేపు ఏం రాబోతోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics