Pawan Kalyan not a police in Harish Shankar’s Movie

Saturday,January 02,2021 - 02:32 by Z_CLU

పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో మరో మూవీ ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై అఫీషియల్ గా ఈ సినిమాను ఎనౌన్స్ చేయడంతో పాటు ప్రీ-లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఇంతకుముందు పవన్-హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు పవన్. సో.. ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ పోలీస్ గా కనిపించే ఛాన్స్ ఉందంటూ గాసిప్స్ వినిపించాయి. అయితే హరీష్ మాత్రం దీనిపై మరోలా స్పందిస్తున్నాడు. కొత్త సినిమాలో పవన్ కల్యాణ్ కేవలం పోలీస్ గా మాత్రమే కనిపించడని, అంతకుమించి పవర్ ఫుల్ గా కనిపిస్తాడని చెబుతున్నాడు.

త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో పవన్ పోలీస్ గా కనిపించబోతున్నాడు. సో.. వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో కూడా పవన్ పోలీస్ పాత్రలో కనిపించే ఛాన్స్ లేదు. ఆ క్లారిటీనే ఇప్పుడు హరీష్ శంకర్ ద్వారా వచ్చింది. పవర్ స్టార్ ను మరో పవర్ ఫుల్ పాత్రలో చూస్తారనంటున్నాడు హరీష్.

Also Check - పని పూర్తిచేసిన పవన్